ఏందన్నా ఏపీ రాజకీయాలు.. మరీ ఇంత దిగజారిపోతున్నాయి రోజు రోజుకి?? ఏమైంది రా..?? అధికారం నిలుపుకోవాలంటే చేసిన అభివృద్ధి చెప్పుకొని గెలవాలిగాని ఇలా రాయితో కొట్టించుకొని, సింపతీ పెంచుకొని, ఓట్లేయించుకొని గెలిచే గెలుపు కూడా ఒక గెలుపేనా అన్నా? అంటే జగనన్న సింపతీ కోసమే తానే రాయితో కొట్టించుకున్నాడు అంటావ్? అంతేగా.. ఏపీ ప్రజలు సింపతీ తోనే ఓట్లేస్తారు అంటావ్? మనుషులం అంటేనే జాలి దయ కలిగినోల్లం కదా అన్నా, కాబట్టి సింపతీ పక్కా వర్క్ అవుట్ అవుతుంది.. భలే లాజిగ్గా మాట్లాడుతావ్ రా నువ్వు.. ఏంటో అన్నా, చిన్నప్పటి నుండి అలా అలవాటైపోయింది.. కనబడవు గాని మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా నీలోపల.. అర్థమయ్యింది.. దొబ్బింది చాలు, టాపిక్ డైవర్ట్ చెయ్యకుండా సోదాపి పాయింట్ కి రా అన్నా.. సరే రా బై.. జగనన్న సింపతీ కోసమే తనే డ్రామా ఆడిండు అనుకుందాం.. దానికి కౌంటర్ గా డ్రామా కోసం ఎవరైనా కన్ను పోగొట్టుకోవాలనుకుంటారా, పక్కనే ఉండి కొట్టింది కాదు కదా, ఎక్కడినుండో విసిరితే తగిలిన దెబ్బ కదా, కరెక్ట్ గా అక్కడే తగులుతుంది అని గ్యారంటీ ఏంటి, కొంచెం అటు ఇటు అయితే ఎలా అని అందరు తీసుకొస్తున్న లాజిక్కు కూడా పక్కన పెడదాం.. హమ్మయ్య, నువ్వొక్కరినే కరెక్ట్ అర్థం చేస్కున్నావన్నా.. వొస్తున్నా వొస్తున్నా.. మన విజనరీ బాబోరు ఈ వయసులో ఇంత కష్టపడి రాజకీయాలు చేస్తున్నది దేనికిరా బై? ఇంకా దేనికి, గెలవడానికి, అధికారంలోకి రావడానికి, మా మాలోకాన్ని, చి చి లోకి అన్నని మున్ముందు సీఎం చెయ్యడానికి.. కదా.. మరి అలా అయితే, సింపతీ తోనే గెలిచే అవకాశమే ఉంటె, ఎలాగో వయసైపోయింది కాబట్టి, అన్నీ అనుభవించాడు కాబట్టి, ఈసారి అధికారంలోకి రాకపోతే ఇంకా దుకాణం మూసేసుకోవాల్సిందే కాబట్టి, వీటన్నిటి దృష్ట్యా, ముఖ్యంగా లోకి అన్న కోసం తనని ఎవరో ఒకరు చంపేసేలా ప్లాన్ వేసుకుంటే ఇంకా బాగా వర్క్ అవుట్ అవుతుంది కదరా..? ఏదన్నా నువ్ అలా మాట్లాడుతున్నావ్.. డైరెక్ట్ గా ఫైట్ చేసి గెలవాలి గాని సావు కోరుకొని గెలుచుడేందన్నా.. అరేయ్.. ఓట్లకోసం తల పగలకొట్టించుకున్నాడు అని అనేటోళ్లు విలువల గురించి మాట్లాడితే ఎలా రా.. పైగా, బాబు గారికి వయసైపోయింది, ఇప్పుడు ఇలా చనిపోయినా కూడా చరిత్రలో గొప్పోడిగా నిలిచిపోతాడు, కొడుకు సీఎం అవుతాడు, జగన్ అన్నని తొక్కేస్తాడు, ఇలా ఎన్నో లాభాలు ఉన్నాయ్ కదరా.. పోనీ ఇంకో ఇరవై ఏళ్ళు ఏమైనా బతికి ఉండి ఇంకేమైనా సాధించేది ఉందా? లేదు కదా.. జగన్ తన స్వార్థం కోసం తల పగలకొట్టించుకున్నపుడు, ఐటీ ని కనిపెట్టిన మహానుభావుడు, జనం కోసమే బతికినోడు, ఏపీ ప్రజల కోసం, సొంత కొడుకు కోసం ప్రాణత్యాగం చెయ్యలేడా..?? సరే బాబు గారు రాజకీయాలకోసం విమర్శిస్తున్నాడు అనుకుందాం, మరి మన పవర్ స్టార్? రేయ్, నేను పవర్ స్టార్ వీరాభిమానిని యాక్టింగ్ లో.. యాక్టింగ్ గురించి తాను ఎన్ని మాట్లాడిన తప్పు లేదు.. తన అనుభవాన్ని రంగరించి చెప్పి ఉంటాడు.. ఆ అనుభవాన్ని ఉపయోగించే ఊగిపోతూ ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు కాబట్టి ముందు ముందు జగన్ కన్నా సూపర్ డూపర్ పెర్ఫార్మన్స్ తో ముందుకు వస్తాడు చూడు.. యాక్టింగ్ లో పవర్ స్టార్ తో పోటీ పడలేడురా, కాబట్టి జగనన్న పనైపోయినట్లే.. 😉😎🤙🔥🔥 నోట్: బాబు చావు కోరుకోవడం నా ఉద్దేశ్యం కాదు, తాను నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. 👍
@SkWarangal Meeru entha lepina vaadidi icefroout laaga cheekina Pinki la batch underground lo settle aipovalsind ra puvva.. jalaga pani Dora Pani aipoyindi inka
@SkWarangal తెలంగాణ వ్యతిరేకి అయిన జగన్ కి ఎలా సపోర్ట్ చేస్తున్నారు బ్రదర్?
@SkWarangal వాళ్ళ ఎలా అని పోనియ్ కానీ వాళ్ళ అలవాట్లు ఇక్కడ కి పాకుతున్నాయి కదా.. అది భయం అయితంది గొడవలు...ఈ ఫేక్ ,డీప్..వీడియోస్ చేయడం లాంటివి..
@SkWarangal Don’t worry bro if our people entertain Andhra media even Telangana politics will be also see these kind of politics