ఒక్కసారి మోసపోతే అయ్యో పాపం అంటారు.. ఒకే విషయంలో మళ్ళీ మళ్ళీ మోసపోతే పాపమేం లేదు, అట్లనే కావాలె, అనుభవించండి అంటారు.. ఎందుకు?? చేసిన మోసం గురించి తెలిసి కూడా మళ్ళీ అదే మోసాన్ని చెయ్యడానికి ప్రయత్నిస్తున్నోన్ని మళ్ళీ గుడ్డిగా నమ్మితే అలానే అంటారు.. ఎవరి గురించి?? ఏ మోసం?? రేపే మాఫీ చేస్తా, డబల్ పింఛన్లు ఇస్తా, తీస్తా, పీకుతా, పొడుస్తా, తొక్కుతా, పేగులు మేడలో వేస్కుంటా అని కాలు కాలిన పిల్లలెక్క ఎగిరేటోనీ గురించి.. ఇగ ఏ మోసం అంటే ఏం చెప్తాము, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్లు, సార్ గారి మోసాల చిట్టా అంతున్నది.. కాబట్టి మీకు ఏది నచ్చితే అది కన్సిడర్ చేస్కోండి.. మోసపోయింది ఎవరు?? మా చేతుల్లో మోసపోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు, కాబట్టి వాళ్ళను మేము మోసం చేస్తున్నాం.. అని బాహాటంగా టీవీ ఇంటర్వ్యూ లో ఎవరిని ఉద్దేశించి చెప్పాడో వాళ్ళు.. ఏం చెయ్యాలి మరి?? ఇన్ని సార్లు మోసం చేసినా ఓట్లేసి గెలిపిస్తే వీళ్ళు అనుభవించాల్సిందే అని అనుకుంటారు.. అలాగే గెలిపిస్తూ పోతే వీళ్ళనెవ్వడు బాగు చెయ్యలేడు అనుకుంటారు.... కాబట్టి ఇంకొకసారి మోసం చేసే ఆలోచన కూడా రాకుండా కర్రుకాల్చి వాత పెట్టాలె...